తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్
BRS Party | ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
హైదరాబాద్ : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్‌కు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్‌తో పాటు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ పాంగి, ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
గిరిధర్ గమాంగ్ ఈ నెల 25న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గిరిధర్ గమాంగ్ తన కుమారుడు కలిసిన సంగతి తెలిసిందే.
9 పర్యాయాలు పార్లమెంటుకు ఎన్నిక
ఒడిశా రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ గిరిధర్ గమాంగ్‌కు ప్రత్యేకత ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గమాంగ్ సొంత రాష్ట్రం నుంచి 9 పర్యాయాలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం వ్యవహారశైలి నచ్చక 2015లో ఆయన బీజేపీలో చేరారు. కాగా, గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా వ్యవహరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

