నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు – వీడియో

రాజన్న సిరిసిల్ల : రాష్ట్రవ్యాప్త నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్ కళాశాలను సీఎం ఆదివారం ప్రారంభించారు. అక్కడి కళాశాల సిబ్బంది, విద్యార్థులతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. విద్య, వసతులపై వైద్యాధికారులను ఆరా తీశారు. ఈ సందర్భంగా నర్సింగ్ విద్యార్థులు తమ స్టైఫండ్ సమస్యను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రారంభం అనంతరం సీఎం మాట్లాడుతూ.. నర్సింగ్ విద్యార్థులకు తీపి కబురు అందించారు. మొదటి సంవత్సరం 1500 గా ఉన్న స్టైఫండ్ ను 5 వేలకు, రెండో సంవత్సరం 1700గా ఉన్న స్టైఫండ్ ను 6 వేలకు, మూడో ఏడాది 1900 గా ఉన్న స్టైఫండ్ ను 7 వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం వెలువరించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, నర్సులు, డాక్టర్లు, ల్యాబ్ టెక్నిషియన్లు, పారా మెడికల్ సిబ్బందికి సీఎం కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

