Nurse Surekha Suicide | ప్రేమకు అడ్డొచ్చారని తల్లిదండ్రులను హత్య చేసి.. ఆపై బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య
Nurse Surekha Suicide | చేసిన పాపం వెంటాడింది.. తల్లీదండ్రులకు ఏ విధంగానైతే మత్తు మందు ఇచ్చి హత్య చేసిందో.. అదే మత్తు మందుతో తాను ఆత్మహత్య(Nurse Suicide ) చేసుకుంది.
సంగారెడ్డి కలెక్టరేట్/బంట్వారం, ఆగస్టు 24: చేసిన పాపం వెంటాడింది.. తల్లీదండ్రులకు ఏ విధంగానైతే మత్తు మందు ఇచ్చి హత్య చేసిందో.. అదే మత్తు మందుతో తాను ఆత్మహత్య(Nurse Suicide ) చేసుకుంది. ‘ప్రేమ’ అనే పదానికి ఈ ముగ్గురు బలయ్యారు. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలానికి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రాంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్న ఆమె ఈ విషయాన్ని జనవరిలో తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆమె ప్రేమను వారు అంగీకరించలేదు.
దీంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను తప్పించాలనుకున్న ఆమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. దీంతో కుప్పకూలిన వాళ్లు మృతిచెందారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నర్సు సురేఖ(25)ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సురేఖ సొంతూరుకు వెళ్లలేక సంగారెడ్డిలోని ఓ హాస్టల్లో ఉంటూ నర్సుగా పనిచేయడం మొదలుపెట్టింది. అయితే తాను చేసిన తప్పు వెంటాడటంతో తీవ్ర మానసిక క్షోభకు గురై ఏ మత్తు మందుతోనైతే తల్లిదండ్రులను కడతేర్చిందో అదే మత్తు మందుతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

