DIET College | హైదరాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేరేడ్మెట్ డైట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇందులో తెలుగు మాధ్యమంలో 11 పోస్టులు, ఉర్ధూ మాధ్యమంలో 5 పోస్టులు ఉన్నాయన్నారు.
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిలాసఫీ/సోషియాలజీ 1, సైకాలజీ1, మ్యాథమేటిక్స్ 2, సైన్స్ అండ్ పెడగాజీ 1, సోషల్ సైన్స్1, ఇంగ్లీష్ 2, తెలుగు 1, హెల్త్ అండ్ సైకాలజీ 01, విజువల్ ఆర్ట్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్1లో మొత్తం 11 పోస్టులు ఉన్నాయి.
ఉర్దూ మీడియంలో సైకాలజీ1, మ్యాథమేటిక్స్1, సైన్స్ అండ్ పెడగాజీ1, సోషల్ సైన్స్1, ఉర్దూ1 సబ్జెక్టులలో కలిపి ఐదు పోస్టులు ఉన్నాయన్నారు. మొత్తంగా 16 గెస్ట్ లెక్చరర్ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గెస్ట్ లెక్చరర్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 31 వరకు ఉందన్నారు. జూలై 3న షార్ట్ లిస్టు తయారు చేస్తారు. జూలై 5, 6 తేదీలలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జూలై 6న తుది జాబితా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు జూలై 7న కాలేజీలో రిపోర్టు చేసే విధంగా డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ షెడ్యూల్ విడుదల చేశారు.