Kaloji Health University | ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు నోటిఫికేషన్
Kaloji Health University | రాష్ట్రంలో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాళోజి హెల్త్ యూనివర్సిటీ : రాష్ట్రంలో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రుభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు.
జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జనవరి 5 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 11 వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు సూచించారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆన్లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్ సైట్ www.knruhs.telangana.gov.in లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

