గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దు
గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రీజినల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
- తెలంగాణ, ఏపీ ఆర్ఆర్బీ
- ఎంప్లాయీస్ అసోసియేషన్ ధర్నా
కవాడిగూడ, జూలై 29: గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ, ఏపీ రాష్ర్టాల రీజినల్ రూరల్ బ్యాంక్ (ఆర్ఆర్బీ) ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలిండియా ఇన్సూరెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ మిశ్రా మాట్లాడుతూ.. 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను కలిపి జాతీయ గ్రామీణ బ్యాంక్‌గా ఏర్పాటు చేయాలన్నారు. మిత్రీ కమిటీ రిపోర్టు ప్రకారం కొత్త నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. దినసరి వేతన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, ఐబీఏ ఆమోదించిన 11వ వేతన ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు. కొత్త పెన్షన్ పథకాన్ని రద్దుచేసి, వాణిజ్య బ్యాంకులతో సమానంగా పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ బ్యాంకులు దేశవ్యాప్తంగా 22 వేలకుపైగా శాఖలను కలిగి ఉన్నాయని, దాదాపు 40 కోట్ల మందికి సేవలు అందిస్తున్నాయని ఆలిండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీ రవికాంత్, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి వెంకటేశ్, ఎన్ సత్యనారాయణ, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

