KTR | నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ : కేటీఆర్
KTR | కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటన కేసులో ప్రభుత్వం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
KTR | కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. లగచర్ల దాడి ఘటన కేసులో ప్రభుత్వం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కేటీఆర్ పేరును సైతం ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్‌తో బీఆర్ఎస్ నేతల ఆదేశాలు ఉన్నాయని.. రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవనిదిరా కుట్ర? ఏంది ఆ కుట్ర? అంటూ తీవ్రంగా స్పందించారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? అంటూ నిలదీశారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో.. రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? అంటూ ప్రశ్నించారు.
గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా? ధ్వజమెత్తారు. నీ ప్రైవేట్ సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చెయ్యడం ఎవరి కుట్ర? అని మండిపడ్డారు. పేద లంబాడా రైతులను బూతులు తిట్టి, బెదిరించింది ఎవరి కుట్ర? ఎవని కోసం కుట్ర! మర్లపడ రైతులు, ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? అంటూ ప్రశ్నించారు. 50 లక్షల బ్యగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? అంటూ ఘాటుగా స్పందించారు. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసునని.. రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకు పోతానన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్లు ఎవ్వరూ లేరు.. అరెస్ట్ చేసుకో రేవంత్ రెడ్డి.. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ ‘ఎక్స్’ పోస్ట్‌లో కేటీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

