Covid-19 | కరోనాపై దిగులు చెందాల్సిన అవసరం లేదని భారతీయ వైద్యుల సంఘం తెలంగాణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని.. భారత్తో పలు దేశాల్లో రెండునెలలుగా వైరస్ సోకుతుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదకరం కాదని.. ఇప్పటికే నివేదిక విడుదల చేసిందని వైద్యుల సంఘం పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని శ్వాసకోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.