హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం పై ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం కమిటీ సభ్యులు సుదీర్ఘం గా సమాలోచనలు జరిపారు. గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో కౌశిక్‌రెడ్డికి గతంలో జారీ చేసిన నోటీసులు, ఆయనపై వచ్చిన ఫిర్యాదులు, సభాపతి వద్ద నమోదైన అంశాలపై లోతు గా చర్చించారు.
అన్ని కోణాల నుంచి విశ్లేషించినప్పటికీ, ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయిన కమిటీ, తీసుకోవాల్సిన చర్యలను త దుపరి సమావేశానికి వాయిదా వేసింది. కాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి తన వివరణను తెలిపేందుకు ఎథిక్స్ కమిటీ ఈ నెల 7వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 8న మరోసారి భేటీ కానున్నట్టు కమిటీ ప్రకటించింది.