కోడిమాంసంతో కొవిడ్ రాదు

వందతులపై చర్యలు తీసుకోండి
లాక్డౌన్ నుంచి పౌల్ట్రీ వాహనాలను మినహాయించాలి
మంత్రి హరీశ్‌రావుకు ఎంపీ రంజిత్‌రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్, మే 14(నమస్తే తెలంగాణ): చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని ఎంపీ, పౌల్ట్రీ బ్రీడర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తిచేశారు. శుక్రవారం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే కుదేలైన పౌల్ట్రీరంగాన్ని ఈ వదంతులు మరింతగా కుంగదీస్తాయని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు ప్రచారంతో ప్రజలు చికెన్ వినియోగాన్ని భారీగా తగ్గించారని, ఫలితంగా ధరలు భారీగా పడిపోయాయని తెలిపారు. గత 14 నెలల్లో మూడోసారి పౌల్ట్రీరంగం కుదేలైందని తెలిపారు. దీనికితోడు ఉత్పత్తి ఖర్చులు 40 శాతానికి పెరిగాయని, ఇది ప్రస్తుత సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వాపోయారు. లాక్డౌన్ నేపథ్యంలో పౌల్ట్రీ వాహనాలను ఆపకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.
కోళ్లకు కరోనా సోకే అవకాశమే లేదు: లక్ష్మారెడ్డి
కోళ్లకు కరోనా సోకే అవకాశమే లేదని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఎక్కడా కూడా కోళ్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాలేదని తెలిపారు. వదంతులను నమ్మొద్దని సూచించారు. వాస్తవానికి కరోనా సమయంలో రోగ నిరోధకశక్తి పెంచుకొనేందుకు చికెన్, గుడ్లు ప్రధానమార్గాలని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలపై పశు సంవర్ధక అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వదంతులు ప్రచారం చేసేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

