Jangaon Medical College | సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం తెలంగాణలో జిల్లా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జనగామ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయగా.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మంగళవారం అనుమతి ఇచ్చింది. కళాశాలలో వంద ఎంబీబీఎస్ సీట్ల అనుమతులు జారీ చేసింది. దాంతో జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడినట్లయ్యింది. ఇటీవల కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా జనగామ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో మొత్తం ఐదు కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతి లభించింది. ఇంకా మరో నాలుగు కాలేజీలకు అనుమతి రావాల్సి ఉండగా.. ప్రక్రియ తుది దశకు చేరింది. ఇందులో నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల కాలేజీలకు అనుమతి రావాల్సి ఉంది. ఒకేసారి రికార్డు స్థాయిలో సీఎం కేసీఆర్ ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. జనగామ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి రావడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.