నోరుపారేసుకుంటే నాలుకలు తెగ్గోస్తం.. తెలంగాణ బిడ్డలను అవమానిస్తే ఊరుకోం
తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకుంటే నాలుకలు తెగ్గొస్తమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లా కొత్తకోట, నారాయణపేట జిల్లాతోపాటు మక్తల్‌లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
- కాంగ్రెస్ పాలనలో ప్రజలకు సంతోషం దూరం: మహబూద్ అలీ
- మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలి: శ్రీనివాస్‌గౌడ్
- మహబూబ్‌నగర్, కొత్తకోట, పేట, మక్తల్‌లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు
మహబూబ్‌నగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రజలపై నోరు పారేసుకుంటే నాలుకలు తెగ్గొస్తమని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లా కొత్తకోట, నారాయణపేట జిల్లాతోపాటు మక్తల్‌లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు బుధవారం నిర్వహించారు. మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాంతీయవాదం.. ఉగ్రవాదం కంటే ప్రమాదం అంటావా? తస్మాత్ జాగ్రత్త అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను హెచ్చరించారు. మాది ముమ్మాటికీ జాతీయవాదమేనని పేర్కొన్నారు. తెలంగాణను మీ స్వార్థం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలు, జీవన విధానాలకు భంగం కలిగించి అభివృద్ధిలో వివక్షత చూపడం వల్లే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడు పోసుకున్నదని గుర్తుచేశారు. హామీలు అమలు చేయక ప్రజల తిరస్కారానికి గురైన రేవంత్ ద్రోహిగా చరిత్ర సృష్టించాడన్నారు.
కాంగ్రెస్ పాలనతో సంతోషానికి ప్రజలు దూరం: మహమూద్ అలీ
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టారని తెలిపారు.
కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న లక్ష్యంతో కార్యకర్తలు అలుపెరుగని కృషి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తిలో ఉన్నాయని, ఇచ్చిన హామీల అమలు కోసం రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ప్రజల వద్దకు వెళ్లి సర్కారు వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో అన్ని వర్గాలను భాగస్వామ్యం చేయాలని, రాష్ట్రంలోనే అత్యధికంగా సభ్యత్వాలు పాలమూరులో నమోదయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. సర్‌లో అర్హుల పేర్లు తొలగించకుండా చూడాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

