Niranjan Reddy | నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Niranjan Reddy | రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Niranjan Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 2500 నుంచి రూ. 3000 మధ్య ఇస్తే సరిపోతాయని నిర్ణయించాం. కానీ కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి.. రైతులకు మించి ఏం ఉండదని ఎకరానికి రూ. 10 వేల నష్ట పరిహారం ఇచ్చారు అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు..? పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేలు దేనికి సరిపోతాయి. రైతులకు ఏమైనా భిక్షం వేస్తున్నారా..? అని మాట్లాడారు. ఇప్పుడు ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి రూ. 10 వేలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మీ చర్యల వల్ల, కరెంట్.. నీళ్లు ఇవ్వక ఎండిపోయిన పంటలు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీయాలి. అలాంటి రైతులకు కూడా రూ. 10 వేలు ఇచ్చేందుకు ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర కోట్ల మంది సేద్యాన్ని నమ్ముకొని బతుకుతున్నారు. వారందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.
100 రోజుల్లోనే రూ. 16,400 కోట్ల అప్పు
ప్రపంచంలోని సంపన్న దేశం అమెరికా నుంచి పేద దేశాల వరకు అప్పులు అనేది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలో భాగం. అప్పులు చేసి సంపదను సృష్టిస్తారు. వారు అలా ఎకానమీని పెంచుకుంటారు. అప్పులు ఏదో కేసీఆర్ తన ఇంటి కోసం చేసినట్టు నీచంగా, చులకనగా మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ అప్పులు చేశాడు అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 100 రోజుల్లోనే రూ. 16,400 కోట్లు ఎలా అప్పు చేశారు. ఏదైనా మాట్లాడే ముందు స్పృహతో మాట్లాడాలని రేవంత్‌కు నిరంజన్ రెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

