‘పాలమూరు’ ప్రాజెక్టును సవాల్ చేయట్లేదు

- పర్యావరణ ఉల్లంఘనలపైనే అభ్యంతరం
- ఏపీ వాసి పిటిషన్‌పై ఎన్జీటీ వ్యాఖ్య
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుపై పిటిషనర్ సవాలు చేయటం లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టంచేసింది. పర్యావరణ ఉల్లంఘనలపై మాత్రమే పిటిషన్ దాఖలైనట్టు వెల్లడించింది. ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్ల అడ్డుకట్ట నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతున్నారని ఏపీలోని ముదిరెడ్డిపల్లికి చెందిన కోస్టి వెంకటయ్య ఎన్జీటీలో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని, 2016లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టగా ఇప్పుడు పిటిషన్ వేయడమేంటని, అది నిర్దేశిత సమయానికి విరుద్ధమని తెలపగా.. కేవలం పర్యావరణ ఉల్లంఘనపైనే పిటిషన్ దాఖలైనట్టు జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సత్యగోపాల్ బెంచ్ తెలిపింది. ఈ కేసులో కేంద్ర పర్యావరణశాఖ, తెలంగాణ సాగునీటిశాఖ తదితరుల కు నోటీసులు జారీచేసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయో లేదో తేల్చేందుకు కేంద్ర పర్యావరణశాఖ ప్రాంతీయ కార్యాలయ సీనియర్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణమండలి చెన్నై ప్రాంతీయ కార్యాలయ శాస్త్రవేత్త, మహబూబ్‌నగర్ కలెక్టర్, నీరి సంస్థ ప్రతినిధి, గనులు, జియాలజీశాఖ డైరెక్టర్లతో కమిటీని నియమించింది. తనిఖీచేసి ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

