ఇంటర్లో కొత్త కోర్సు ఫార్మాటెక్నాలజీ

- ఈ ఏడాది నుంచే కొత్త కోర్సు
- 4 కాలేజీల్లో ప్రవేశాలు ప్రారంభం
- కోర్సు రూపకల్పనలో రెడ్డీస్ ల్యాబ్స్ సహకారం
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సు ఫార్మసీ. బీ ఫార్మసీతోపాటు ఫార్మా-డీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్ పూర్తిచేసిన వారికి ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఇంటర్ స్థాయిలో కూడా ఫార్మసీ కోర్సును ఇంటర్ విద్యా మండలి ప్రవేశపెట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ‘ఫార్మా టెక్నాలజీ’ పేరుతో నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభిస్తున్నారు. ఇది పూర్తిగా వోకేషనల్ కోర్సు. దీనిని హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ వోకేషనల్ కాలేజీ, సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ, నల్లగొండ, భువనగిరిలోని ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఈ కోర్సు రూపకల్పనలో సహకారం అందించింది. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి రెడ్డీస్ ల్యాబ్స్‌లోనే అప్రెంటిస్షిప్తోపాటు ఉద్యోగం కూడా ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

