హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఫార్మసీ సహా పలు కోర్సుల్లో కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీ ఫార్మసీ, ఫార్మా -డీ కోర్సులతోపాటు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) కోర్సుల ఫీజులు సైతం పెరిగాయి. ఇవే కాకుండా ఎం ఫార్మసీ, ఎం ఆర్క్ వంటి కోర్సుల ఫీజులు కూడా పెరిగాయి. ఆయా కోర్సుల్లో చేరేవారు ఇక నుంచి పెంచిన ఫీజులను కట్టాల్సిందే. వాస్తవానికి ఈ ఫీజులు గతేడాదే పెరిగాయి. కానీ అప్పటికే కౌన్సెలింగ్ పూర్తయ్యింది. దీంతో కౌన్సెలింగ్ సమయంలో పెంచిన ఫీజులను వర్తింపజేయలేదు. కానిప్పుడు కౌన్సెలింగ్ సమయంలోనే విద్యార్థులు పెంచిన ఫీజులు కట్టాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ గల వారికి ఫీజులను మినహాయిస్తారు.
పెరిగిన ఫీజుల వివరాలు