పూటకో పార్టీ మారితే ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యే వాడిని!
పూటకో పార్టీ మారితే తాను కూడా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం కార్పొరేటర్ల స్టడీ టూర్ బస్సులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రా జేందర్‌రెడ్డి మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఘాటు గా స్పందించారు.
- మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయిని కౌంటర్
వరంగల్/నయీంనగర్, సెప్టెంబర్ 14 : పూటకో పార్టీ మారితే తాను కూడా ఐదుసార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఆదివారం కార్పొరేటర్ల స్టడీ టూర్ బస్సులను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రా జేందర్‌రెడ్డి మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఘాటు గా స్పందించారు. అవకాశవాద రాజకీయాలు చేయడం తనవల్ల కాదని, ఇచ్చిన మొదటి అవకాశాన్ని వినియోగించుకొని ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. 40 ఏండ్లుగా పార్టీ కోసమే పని చేశానని పేర్కొన్నారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న భద్రకాళీ దేవాలయంపై మంత్రి పెత్తనమేమిటని మండిపడ్డారు. మంత్రి నియోజకవర్గం నుంచే ఏడుగురిని నియమిస్తే ఎలా అని ప్రశ్నించారు. మం త్రి స్థాయిలో ఉండి వ్యగ్యంగా మా ట్లాడటం, అదృష్టం కొద్దీ గెలిచారని అనడం సరైందికాదన్నారు.
రాజగోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు అందలేదు
- ఫిర్యాదు వస్తే చర్యల కోసం పరిశీలిస్తాం : మల్లు రవి
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : సొంత పార్టీపై సంచనల వ్యాఖ్యలు చేస్తున్న ము నుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు క్రమశిక్షణ సంఘం వెనకాడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఆయన పై పార్టీకి గానీ, క్రమశిక్షణ సంఘానికిగానీ ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే ఆయన విషయాన్ని పట్టించుకోవడం లేదని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని విలేకరులు ప్రశ్నించగా.. ఆయనపై తమకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

