NHRC | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ రవిగుప్తాకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల వర్సిటీ భవనంపై నుంచి దూకి విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
మీడియా కథనాలను ఆధారంగా సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం.. నాలుగువారాల్లోగా వివరణ ఇవ్వాలనంటూ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఈ నెల 5న సంగారెడ్డి జిల్లా రుద్రాంలో ఉన్న గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీ భవనంలోని ఐదో అంతస్తుపైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ప్రాణాలను తీసుకున్నది. ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.