Dundra Kumaraswamy | కాంగ్రెస్, బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదు.. ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు మేలు: జాతీయ బీసీదళ్
కాంగ్రెస్, బీజేపీ తమ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వెనకబడిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి పాటుపడింది లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
Dundra Kumaraswamy | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ తమ హయాంలో బీసీలకు చేసిందేమీ లేదని జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప వెనకబడిన వర్గాల సమగ్ర అభ్యున్నతికి పాటుపడింది లేదని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. దేశాన్ని కొన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన మంచిని చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు మంచి జరుగుతుందని ఆశించినా అదేమీ జరగలేదని మండిపడ్డారు. బీజేపీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. బీసీ జనాభా ఆధారంగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తామని, బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించి అన్ని అధికారాలు అప్పగిస్తామని చెప్పడం బీసీలను వంచించే రాజకీయాలకు నిదర్శమని వివరించారు. కేవలం ఎన్నికల కోసమే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జనగణన చేస్తామంటూ మళ్లీ మోసపూరిత హామీలకు తెగబడుతున్నాయని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

