హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): టీహబ్ స్టార్టప్ బ్లూసపైర్కు నాస్కామ్ అవార్డు దక్కింది. నాస్కామ్ జాతీయస్థాయిలో ఎమర్జ్ 50 అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈ నెల 7,8న నిర్వహించింది. ఇందులో 11 రంగాల్లోని స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అందులో సైబర్ సెక్యూరిటీ విభాగంలో టీ హబ్ కేంద్రంగా స్టార్టప్ కార్యకలాపాలు ప్రారంభించిన బ్లూసఫైర్కు ఇటీవల నాస్కామ్.. అవార్డు ఇచ్చినట్టు టీహబ్ నిర్వాహకులు తెలిపారు. వివిధ రంగాల స్టార్టప్‌లకు ఇండస్ట్రి నిపుణులు సరైన ప్రోత్సాహం అందింస్తుండటంతో అవి మంచి పనితీరును కనబరుస్తున్నాయని పేర్కొన్నారు.