నాపై కుట్ర.. నాకు ప్రాణహాని
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనపై కుట్ర జరిగిందని ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ ఆరోపించారు. ఈ కేసులో తాను నిందితుడినో, బాధితుడినో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. కొందరు తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని, తనకు ప్రాణాహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరారు.
- నిందితుడినో, బాధితుడినో త్వరలో తేల్తది
- నా హోటల్ అన్యాయంగా కూల్చారు
- డీజీపీ రవిగుప్తాకు నందకుమార్ ఫిర్యాదు
హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తనపై కుట్ర జరిగిందని ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్ ఆరోపించారు. ఈ కేసులో తాను నిందితుడినో, బాధితుడినో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. కొందరు తనను హతమార్చేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని, తనకు ప్రాణాహాని ఉన్నదని, రక్షణ కల్పించాలని కోరారు. గురువారం హైదరాబాద్‌లో డీజీపీ రవిగుప్తాకు పలు అంశాలపై ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తాను జైలులో ఉండగానే తన హోటల్‌ను అన్యాయంగా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, హీరో వెంకటేశ్, రానా, జీహెచ్ఎంసీ అధికారులపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తన ఫోన్లను టాంపరింగ్ చేశారని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, ఆ తర్వాత తనపై అనేక కేసులు పెట్టారని తెలిపారు., తనపై పెట్టిన కేసులపై నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని డీజీపీని కోరినట్టు ఆయన వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

