ప్రజాగ్రంథాలయానికి పదకొండేళ్లు
ఒకప్పుడు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఖ్యాతికెక్కాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను చదువుకున్న వేలాదిమంది మేధావులుగా ఎదిగారు.
- 1982-83 పదోతరగతి బ్యాచ్ విద్యార్థుల చొరవతో 2014లో ఏర్పాటు
- నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ఆధ్వర్యంలో కథల పోటీలు
- 2025 కథల పోటీల విజేతలకు నేడు బహుమతుల ప్రదాన కార్యక్రమం
- హాజరుకానున్న మంత్రి పొన్నం, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి
హనుమకొండ సబర్బన్ /భీమదేవరపల్లి, జూలై 26 : ఒకప్పుడు గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలుగా ఖ్యాతికెక్కాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో పుస్తకాలను చదువుకున్న వేలాదిమంది మేధావులుగా ఎదిగారు. సాంకేతిక వ్యవస్థ అభివృద్ధితోపాటు గ్రంథాలయాలు కనుమరుగయ్యాయి. ఇలాంటి తరుణంలో హనుమకొండ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ పూర్వ విద్యార్థులు ప్రజాగ్రంథాలయాన్ని 2014లో ఏర్పాటుచేశారు. దీనికి ప్రజాప్రతినిధులు చేయూతనందించారు. కేవలం పుస్తకాలే కాకుండా డిజిటల్ వ్యవస్థగా రూపాంతరం చెంది ఈ ప్రాంత విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే గనిగా మారి నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతున్నది. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం-నమస్తే తెలంగాణ దినపత్రిక భాగస్వామ్యంతో ఏటా జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న కథలపోటీల నిర్వహణతో ఈ గ్రంథాలయం రాష్ట్రంలోనే ప్రాధాన్యం సంతరించుకున్నది.
రూపకల్పన ఇలా..
జిల్లాలోనే అత్యధిక జనాభా కలిగిన గ్రామంగా ముల్కనూరు ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ అనేకమంది విద్యార్థులు నిత్యం విద్యాభ్యాసం కోసం హనుమకొండ వంటి పట్టణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఇతర సమయాల్లో ఇక్కడి విద్యార్థులు చదువుకునేందుకు పుస్తకాలు గానీ, చెప్పేవారు గానీ ఎవరూ లేకుండా పోయేది. ఈ తరుణంలో పోటీ పరీక్షలకు హాజరు కావాలంటే విద్యార్థులు వెనకబడేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించిన 1982-83 పదోతరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో వారి పేరు చిరకాలం గుర్తుండేలా గ్రామంలో మంచి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు. స్పందన చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి గ్రామంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఆ తర్వాత మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని ఆలోచించి ముల్కనూరు ప్రజాగ్రంథాలయం పేరిట లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రస్తుత సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ప్రధాన పాత్ర పోషించారు.
ప్రజాప్రతినిధుల సహకారం..
2014లో ముల్కనూరు ప్రజాగ్రంథాల యం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులకు ప్రజాప్రతినిధులు ఇతోధికంగా సహకారాన్ని అందించారు. అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఆదేశాలతో గ్రామం నడిబొడ్డున ప్రధాన రహదారి పక్కనే ఎనిమిది గుంటల భూమిని కేటాయించారు. అప్పటి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు రూ.10లక్షలు, ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ రూ.10 లక్షలు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ.5 లక్షలు వారి వారి నిధులనుంచి కేటాయించగా, స్పందన చారిటబుల్ ట్రస్టు, ముల్కనూరు గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు మరో రూ.10లక్షలు సమకూర్చా రు. మంచి భవనాన్ని నిర్మించి, వేముల శ్రీనివాసులుతోపాటు ఇతరులు తమకున్న పరిచయాలతో పోటీ పరీక్షల కోసం అనేక రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్ర మంలో రాష్ట్రంలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రంథాలయాల్లో తొలిసారి ముల్కనూరు ప్రజాగ్రంథాలయాన్ని డిజిటలైజేషన్‌గా మార్చారు.
నమస్తే తెలంగాణ భాగస్వామ్యంతో..
ముల్కనూరు ప్రజాగ్రంథాలయానికి నమ స్తే తెలంగాణ తోడయ్యింది. దేశవ్యాప్తంగా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా ప్రతి ఏడు మాదిరిగానే 2025లో కథల పోటీలు నిర్వహించింది. ఎంపికైన విజేతలకు నేడు బహుమతి ప్రదానం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్ కుమార్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ స్నేహాశబరీశ్, కవి అందెశ్రీ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, హనుమకొండ జడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి హాజరుకానున్నట్టు నిర్వాహకులు సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ వంగ రవి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

