సీపీఐలో మునుగోడు లొల్లి
కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి కేటాయించాల్సిందేనని నల్లగొండ జిల్లా నేతలు పట్టుబట్టారు.
- కాంగ్రెస్‌తో పొత్తులో సీటు లేదంటూ నెల్లికంటి సత్యం ఫైర్
- కూనంనేని సాంబశివరావు తీరుపై క్యాడర్‌కు అనుమానాలు
- పొత్తు లేకపోయినా పోటీకి సిద్ధమంటున్న ఆ పార్టీ కార్యకర్తలు
నల్లగొండ, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంశం సీపీఐలో చిచ్చురేపుతున్నది. పొత్తులో భాగంగా ఆది నుంచీ మునుగోడును ఆ పార్టీ బలంగా కోరుతున్నది. బీఆర్ఎస్తో చర్చల సమయంలోనూ, తాజాగా కాంగ్రెస్ పొత్తులోనూ మునుగోడును సీపీఐకి కేటాయించాల్సిందేనని నల్లగొండ జిల్లా నేతలు పట్టుబట్టారు. ముందు నుంచి జరిగిన ప్రచారం మేరకు సీపీఐ బెల్లంపల్లి, హుస్నాబాద్, కొత్తగూడెం, మునుగోడు స్థానాలు కావాలని కోరుతూ వచ్చింది. నాలుగు స్థానాలు కేటాయించలేమని, రెండు చోట్ల మాత్రమే సర్దుబాటు చేయగలమని కాంగ్రెస్ నాయకత్వం తేల్చి చెప్పింది. ఇందులో కొత్తగూడెం కూడా ఇవ్వలేమని చెప్పినట్టు సమాచారం. రెండు సీట్లు మాత్రమే ఇస్తామని, అందులో ఒకటి జనరల్, మరొకటి రిజర్వుడు స్థానం కేటాయిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఆదివారం కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా కొత్తగూడెంతోపాటు చెన్నూరును సీపీఐకి కేటాయిస్తున్నట్టు ప్రకటన వచ్చింది. దీంతో ఒక్కసారిగా నల్లగొండ జిల్లాలో ఆ పార్టీ నేతలు భగ్గుమన్నారు.
జనరల్ స్థానమైన కొత్తగూడెం కోసం మరో జనరల్ స్థానమైన మునుగోడును బలిపెట్టి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన చెన్నూరును తీసుకున్నారని నల్లగొండ జిల్లా సీపీఐ కార్యదర్శి నెల్లికంటి సత్యం మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సొంత ప్రయోజనాల కోసమే మునుగోడును వదిలేశారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోవడానికి కూడా కొత్తగూడెం సీటు విషయంలో కూనంనేని సాంబశివరావు వ్యవహారశైలే కారణమన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం తన సీటు కోసమే బీఆర్ఎస్కు దూరమై కాంగ్రెస్‌కు దగ్గరయ్యేలా ఆయన వ్యవహరించారని చెప్తున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని నెల్లికంటి సత్యం స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

