Telangana | తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై.. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు
Telangana | నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురు యువకులకు గుండు గీయించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
Telangana | నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే ఓ యువకుడు తల దువ్వుకున్నాడని కోపంతో ఊగిపోయిన ఎస్సై.. ముగ్గురు యువకులకు గుండు గీయించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లా లింగాల వద్ద ఓ పెట్రోల్ బంక్ సిబ్బందితో ముగ్గురు యువకులకు ఇటీవల గొడవ జరిగింది. దీనిపై పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ గొడవను నచ్చజెప్పాల్సిన పోలీసులు మాత్రం అతిగా ప్రవర్తించారు. ముగ్గురు యువకులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై జగన్మోహన్ రెడ్డి.. వారికి వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఓ యువకుడు తల దువ్వుకోవడంతో ఎస్సై సీరియస్ అయ్యాడు. నా ముందే తలదువ్వకుంటావా అని వారిపై కోపంతో రెచ్చిపోయాడు. వెంటనే ముగ్గురు యువకులకు గుండు గీయించాడు.
ఇలా అందరిముందు గుండు గీయించడంతో ముగ్గురు యువకులు మనోవేదనకు గురయ్యారు. వారిలో నితీశ్ అనే యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. తన పరువు పోయిందని భావించి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని నాగర్‌కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నితీశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తమ దురుసు ప్రవర్తన కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించినప్పటికీ ఎస్సై మాత్రం తన తీరును మార్చుకోలేదని సమాచారం. మిగతా ఇద్దరు యువకులను ఊరు విడిచి హైదరాబాద్ వెళ్లిపోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

