KGBV | ఇంగ్లీష్ టీచర్ వేధిస్తోంది.. మండుటెండలో కేజీబీవీ విద్యార్థినుల ధర్నా
KGBV | నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే.
KGBV | నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. పది రోజులైనా టీచర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇంగ్లీష్ టీచర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ.. విద్యార్థినులు మరోసారి మండుటెండలో ధర్నా చేశారు. మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటల నుంచి విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. ఇంగ్లీష్ టీచర్ కళ్యాణినీ సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్ళమని, భోజనం ముట్టుకోమని విద్యార్థినులు తేల్చిచెప్పారు.
మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థినుల ధర్నా
మేడమ్ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది, చదవక పోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు
నాగర్… https://t.co/PMBvC2Lshj pic.twitter.com/PezTWIclot
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

