Manda Jagannadham | మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూత..
Manda Jagannadham | నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
Manda Jagannadham | నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మందా జగన్నాథం నాగర్ కర్నూల్ ఎంపీగా పని చేశారు. తొలిసారిగా 1996 పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1999, 2004 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 1998 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 1999-2008 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీలో, 2008-2013 మధ్యకాలంలో కాంగ్రెస్‌లో, 2013-14 మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీల్లో కొనసాగారు.
2014 పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎంపీ టికెట్ దక్కలేదు. 2022 జూలై 1న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అప్పటి సీఎం కేసీఆర్ నియమించారు. ఆయన 2023 నవంబర్ 17న బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నాగర్ కర్నూల్ లోక్‌సభ ఇవ్వకపోవడంతో ఆయన బీఎస్పీలో చేరారు. మందా జగన్నాథం మృతికి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి బాధాకరమని.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ పార్టీకి సేవలందించారు. జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం గారి మృతి బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
నాలుగు సార్లు నాగర్ కర్నూల్ ఎంపీగా పనిచేసి, రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. బిఆర్ఎస్ పార్టీకి సేవలందించారు. జగన్నాథం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
ఓం… pic.twitter.com/p7j7jxI9uA— Harish Rao Thanneeru (@BRSHarish) January 12, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

