Nallagonda | నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి కేసులో వీడిన మిస్టరీ
నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన కేసులో మిస్టరీ వీడింది. పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్ల చేత హత్య చేయించి పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్ : నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన కేసులో మిస్టరీ వీడింది. నల్లగొండ జిల్లా కేంద్రం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన మహమ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (40), కుమారుడు ముజమిల్(20), కుమార్తె అక్సర (11) అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు గురైన హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్ చేత హత్య చేయించినట్లు నిర్ధారణ అయింది.
హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు జరగగా.. నల్లగొండకు చెందిన మహ్మద్ సుల్తాన్‌ను మూడో వివాహం చేసుకుంది. సుల్తాన్‌కు కూడా గతంలో రెండు పెళ్లిళ్లు జరగగా.. సుల్తాన్ మొదటి భార్య పిల్లలు మహ్మద్ ముజమిల్, అప్సరతో కలిసి నల్లగొండలో జీవిస్తున్నారు. హసీనా పేరు మీద కోటి రూపాయల విలువైన స్థలాలు, ఇండ్లు ఉన్నాయి.
ఆ ఆస్తిని తమకు ఇవ్వకుండా తన మూడో భర్త అయిన సుల్తాన్ పిల్లల మీద వీలునామా రాస్తున్నట్లు హసీనా చెప్పడంతో కక్ష పెంచుకొని, హసీనా మొదటి భర్త కూతురు, అల్లుడు కలిసి హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నలుగురు రౌడీ షీటర్ల చేత హత్య చేయించి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. సుల్తాన్ మృతదేహంపై 6 చోట్ల కత్తి గాయాలు ఉండగా, హసీనాకు 7 చోట్ల, కుమార్తె అక్సరకు 9 చోట్ల, ముజమిల్‌కు ఏకంగా 16 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

