Crime News | మిస్టరీ వీడిన రఘునాథ పాలెం తల్లీకూతుళ్ల మృతి మిస్టరీ
Crime News | ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లీ కూతుళ్ల మృతిపై మిస్టరీ వీడింది. భార్య కుమారి, కూతుళ్లు కృషిక, తనిష్కను భర్త ప్రవీణ్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Crime News | ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లీ కూతుళ్ల మృతిపై మిస్టరీ వీడింది. భార్య కుమారి, కూతుళ్లు కృషిక, తనిష్కను భర్త ప్రవీణ్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ఇంజక్షన్‌తో విషం ఇచ్చి భార్యను హత్య చేసినట్లు పోస్ట్ మార్టం నివేదికలో నిర్ధారించారు. రఘునాథ పాలెం పోలీస్ స్టేషన్ లో గత మే 29న అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు మరణించినట్లు కేసు నమోదైంది. 45 రోజుల తర్వాత నిర్వహించిన పోస్ట్ మార్టం నివేదికలో హత్య చేసినట్లు నిర్ధారించారు.
ఇంజక్షన్ ఇచ్చిన భార్యను హత్య చేసిన ప్రవీణ్ కుమార్.. హత్యగా చిత్రీకరించడానికి మే 28 తేదీనే రఘునాథ పాలెంలో కారును చెట్టుకు ఢీకొట్టాడు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిజియో థెరపీ వైద్యుడిగా హైదరాబాద్‌లో ప్రవీణ్ కుమార్ పని చేస్తున్నాడు. ఖమ్మం జిల్లాలోని ఏన్కూర్ మండలం రంగాపురం వాసి కుమారికి, బావోజీ తండా వాసి ప్రవీణ్ కుమార్ కు ఆరేండ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుళ్లు మరణిస్తే, కారు నడిపిన ప్రవీణ్ కుమార్ కు పెద్దగా గాయాలు కాకపోవడంపై అప్పట్లోనే ఆయన బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
బాలికల పట్ల పారిశుధ్య కార్మికుడి అసభ్య ప్రవర్తన?
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటాం : హరీశ్ రావు
Aaryavir Sehwag: ఆర్యవీర్ సెహ్వాగ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

