Mahabubabad | నమ్మించి కిడ్నీ తీసుకున్నారు.. ఉన్న కిడ్నీ చెడిపోయి చావుబతుకుల్లో బాధితుడు!
‘మా నాన్న ధరావత్ చిట్టిబాబుకు మాయ మాటలు చెప్పి అవసరానికి కిడ్నీ తీసుకుని మోసం చేశా రు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల్లో ఉన్నాడు’ అని అతడి కుమార్తె భూక్యా రమాదేవి శనివారం కురవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
- ఏడాదిన్నర తర్వాత వెలుగులోకి..
- పోలీసులను ఆశ్రయించిన బాధితులు
కురవి, మార్చి 1: ‘మా నాన్న ధరావత్ చిట్టిబాబుకు మాయ మాటలు చెప్పి అవసరానికి కిడ్నీ తీసుకుని మోసం చేశారు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల్లో ఉన్నాడు’ అని అతడి కుమార్తె భూక్యా రమాదేవి శనివారం కురవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు శివారు పొలంపల్లి తండాకు చెందిన ధరావత్ చిట్టిబాబుకు ఇద్దరు కుమారులు నితిన్, రాము, కుమా ర్తె రమాదేవి ఉన్నారు. భార్య విజయ 3 ఏండ్ల క్రితం మృతిచెందింది. నల్లెల్ల శివారు గాజతండాకు చెందిన ధరావత్ చంద్ర అనే వ్యక్తి సంవత్సరంన్నర క్రితం కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా, గాజతండా కు చెందిన ధరావత్ సురేశ్, బానోత్ నవీన్‌తో కలిసి పొలంపల్లి తండాకు చెందిన ధరావత్ రవి వద్దకు వచ్చారు.
నలుగురు కలిసి ధరావత్ చిట్టిబాబు ఇంటికి వెళ్లి కిడ్నీ ఇస్తే రెండు ఎకరాల భూమి, రెండు గుంటల స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్య లు వచ్చినా చూసుకుంటామని చెప్పి ఒప్పించారు. కుటుంబసభ్యుల సమక్షంలో అగ్రిమెంటు రాసి, చిట్టిబాబును హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి కిడ్నీ తీయించి, చంద్రకు అమర్చారు.
ప్ర స్తుతం చిట్టిబాబుకు ఉన్న ఒక్క కిడ్నీ చెడిపోయింది. ఆరోగ్యం బాగాలేదని, నాడు హామీ ఇచ్చిన వారి వద్దకు వెళ్లి అడిగితే తమకేం సంబంధం లేదని, దిక్కున్నచోట చెప్పుకోమన్నారు. తన తండ్రి అనారోగ్యంతో మహబూబాబాద్ ఏరియా వై ద్యశాలలో చికిత్స పొందుతున్నాడని, మోసం చేసిన చంద్ర, రవి, సురేశ్, నవీన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రమాదేవి ఫిర్యాదులో పేర్కొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

