కులగణనలో ముస్లింలకు అన్యాయం.. ఉప కులాల లెక్కల్లో గందరగోళం
సర్కార్ తాజాగా విడుదల చేసిన కులగణన సర్వే లెక్కల్లో గందరగోళం నెలకొన్నది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ ముస్లింల్లోని 14 వర్గాలకు చెందిన 64 ఉప కులాల జనాభా 35,76,588 (10.88%) మంది ఉన్నట్టు చూపించగా, ఓసీ ముస్లింల జనాభాను 8,80,424 (2.48%) మందిగా పేర్కొన్నారు.
- కావాలనే విస్మరించారని ఆరోపణ
హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : సర్కార్ తాజాగా విడుదల చేసిన కులగణన సర్వే లెక్కల్లో గందరగోళం నెలకొన్నది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ ముస్లింల్లోని 14 వర్గాలకు చెందిన 64 ఉప కులాల జనాభా 35,76,588 (10.88%) మంది ఉన్నట్టు చూపించగా, ఓసీ ముస్లింల జనాభాను 8,80,424 (2.48%) మందిగా పేర్కొన్నారు. ఇది పూర్తిగా తప్పని మైనారిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఓసీ ము స్లింల్లో సయ్యద్, ముషైక్, మొఘల్, పఠాన్, ఇరానీ తదితర 16 ఉప కులాలు ఉన్నాయని చెప్తున్నారు. సబ్క్యాస్ట్ల వారీగా లెక్కించకుండా 2.48%గా చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఎండీ, అబ్దుల్లా ప్రస్తావించలేదు?
కులగణన సర్వేలో బీసీ-ఈ క్యాటగిరీలో ఎండీ, అబ్దుల్లా ముస్లింలను ప్రత్యేకంగా చూపకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2007లో బీసీ-ఈ క్యాటగిరీ ముస్లింలకు అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు కల్పించిందని చెప్తున్నారు. అయితే, రిజర్వేషన్‌కు సంబంధించిన ఉత్తర్వుల్లో ఎండీ అనే ఇంటి పేరు లేకపోవడంతో బీసీ-ఈ సర్టిఫికెట్లు జారీచేయలేదని గుర్తుచేస్తున్నారు.
సర్వేలో తీవ్ర గందరగోళం : యాకూబ్‌పాషా
సర్కార్ విడుదల చేసిన కులగణన సర్వేలో గందరగోళం నెలకొన్నదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా ఆరోపించారు. ముస్లింల జనాభాను తగ్గించి చూపారని, కొన్ని ఉప కులాలను సర్వే చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

