మునుగోడులో నేటి నుంచి నామినేషన్లు
నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- ఈ నెల 14 వరకు గడువు
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
చండూరు, అక్టోబర్ 6 : నల్లగొండ జిల్లా మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనున్నది. శుక్రవారం నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు తాసిల్దార్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. రిటర్నింగ్ అధికారిగా జగన్నాథరావు వ్యవహరించనున్నట్టు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఈ నెల 3 నుంచే అమల్లోకి వచ్చిన విషయం తెల్సిందే.
ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుందని, నామినేషన్ దాఖలు చేసే వ్యక్తితో కలిసి ఐదుగురికి మాత్రమే కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా ఈనెల 15న నామినేషన్ల పరిశీలన, 17న నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

