Munneru Vaagu | ఎన్‌హెచ్ 65పై ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు.. విజయవాడ వెళ్లే వాహనాలు కోదాడ వద్ద దారిమళ్లింపు
భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది.
హైదరాబాద్: భారీ వర్షాలతో మున్నేరు వాగుకు (Munneru Vaagu) వరద (Floods) పోటెత్తింది. ఖమ్మం (Khammam) నగరాన్ని ముంచెత్తిన మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) ఐతవరం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై (NH 65) ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ (Vijayawada) వైపు వెళ్లే వాహనాలను పోలీసులు కోదాడ (Kodada) వద్ద దారి మళ్లిస్తున్నారు (Diversion). హైదరాబాద్ (Hyderabad) నుంచి వెళ్తున్న వాహనాలను హుజూర్నగర్, మిర్యాలగూడ, పిడుగురాళ్ల మీదుగా విజయవాడకు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు
ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. సహాయక చర్యల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్‌తో కలిసి అనుక్షణం పర్యవేక్షించారు. మున్నేరు వరద ఉధృతి పెరగడంతో మైక్‌తో అప్రమత్తం చేస్తూ ఇళ్లల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాలైన పద్మావతి నగర్, గుర్రం ఫంక్షన్ హాల్ ప్రాంతం, మంచికంటి నగర్, బొకలగడ్డ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించింది. ఇళ్లలో, మేడపై మిగిలి ఉన్న బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పద్మావతి నగర్‌లోని ధ్యాన మందిరంలోని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెండు బృందాలుగా ఏర్పడి ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనం రెండో అంతస్తులో బిక్కు బిక్కు మంటూ భయాందోళనలో ఉన్న మునగాటి లక్ష్మీనారాయణ, మునగాటి లక్ష్మీదేవి, మునగాటి యశ్వంత్, ప్రవళ్లిక, అరవింద్, కావ్య, విఘ్నేష్ 5 నెలల బాబుతోపాటు బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్‌కు చెందిన 20మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

