ఖమ్మంలో మున్సిపల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఖమ్మం నగర పాలకసంస్థ (కేఎంసీ) కార్యాలయ అటెండర్ డీ మాధవి కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ఎదుట బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కేఎంసీ సిబ్బంది.. ఆమెను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. మాధవి 20 ఏళ్లుగా కేఎంసీలో అటెండర్‌గా పనిచేస్తున్నది. హెల్త్ వర్కర్‌గా విధుల్లో చేరిన ఆమెను.. గతంలో పనిచేసిన మేయర్ అటెండర్‌గా బదిలీ చేశారు.
- అకారణంగా సస్పెండ్ చేశారంటూ మనస్తాపం
- బదిలీ చేసిన చోట చేరలేదంటున్న కమిషనర్
ఖమ్మం, మార్చి 5: ఖమ్మం నగర పాలకసంస్థ (కేఎంసీ) కార్యాలయ అటెండర్ డీ మాధవి కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ ఎదుట బుధవారం ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కేఎంసీ సిబ్బంది.. ఆమెను 108 వాహనం ద్వారా ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. మాధవి 20 ఏళ్లుగా కేఎంసీలో అటెండర్‌గా పనిచేస్తున్నది. హెల్త్ వర్కర్‌గా విధుల్లో చేరిన ఆమెను.. గతంలో పనిచేసిన మేయర్ అటెండర్‌గా బదిలీ చేశారు.
జనవరి 6న పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా విధులను కేటాయిస్తూ కమిషనర్ అభిషేక్ అగస్త్య పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆ విధులను నిర్వర్తించలేనని, అటెండర్‌గానే విధులు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని కమిషనర్, మేయర్‌ను కోరారు. దీంతో అటెండర్‌గానే డ్యూటీ చేసుకోవాలని వారు మౌఖిక ఆదేశాలు జారీచేయడంతో విధులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ హెల్త్ వర్కర్‌గా ఎందుకు వెళ్లడం లేదంటూ పలుమార్లు ఆమెకు షోకాజ్ నోటీసులు అందగా సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ మెమోలకు జవాబు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ కమిషనర్ పేరుతో గురువారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
శుక్రవారం ఆ ఉత్తర్వులను ఇంటికి పంపించారు. నోటీసులకు, మెమోలకు తాను సమాధానం ఇచ్చినప్పటికీ తనను సస్పెండ్ చేశారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కమిషనర్‌కు చెప్పేందుకు శుక్రవారం కమిషనర్ కార్యాలయానికి వెళ్లగా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వారం రోజుల తరువాత కలవాలని సీసీ ద్వారా సమాచారం అందించారు. బుధవారం మరోసారి వెళ్లినా కమిషనర్ టైం ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెంది కమిషనర్ చాంబర్ ఎదుటే నిద్రమాత్రలు మింగింది. కాగా బదిలీ చేసిన చోట జాయిన్ కానందునే మాధవికి నోటీసులు ఇచ్చామని, వాటికి స్పందించకపోవడంతోనే సస్పెండ్ చేశామని కమిషనర్ అభిషేక్ అగస్త్య వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Election Schedule | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మూడు విడతలుగా ఎన్నికలు
Soma Bharat Kumar | హరీశ్ రావుకు ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదు : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్
Kuravi | వీరన్న సన్నిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల పూజలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

