కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో సీడ్స్ బాల్స్ చల్లే కార్యక్రమం.. ప్రారంభించిన ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్
KCR Eco Park in Mahaboob Nagar: మహబూబ్‌నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ఈ పార్కు అభివృద్ధి కోసం తన వంతు సహకారం కూడా అందిస్తానని ఆయన తెలిపారు.
పదేండ్ల క్రితం మహబూబ్‌నగర్‌లో నమస్తే తెలంగాణ యూనిట్ ప్రారంభానికి వచ్చినప్పుడు సేదదీరుదామంటే ఎక్కడా అవకాశం లేదని, ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని ఎంపీ పేర్కొన్నారు. అదేవిధంగా రెండు కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసిన మహిళలందరికీ ఎంపీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. చెట్లను నరకడంవల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసమే సీఎం కేసీఆర్ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి దేశవ్యాప్తం చేశారని, ప్రతి ఒక్కరిలో ప్రకృతిని కాపాడుకోవాలనే అవగాహన కల్పించారని మంత్రి కొనియాడారు. జిల్లా ప్రజలంతా తమ పుట్టినరోజులను మొక్కలు నాటి జరుపుకోవాలని సూచించారు. చిన్నగా ఉన్న మయూరి నర్సరీని 2097 ఎకరాల విస్తీర్ణంలో కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

