Kavitha | కరెంట్ తీగలు పట్టుకో.. 24 గంటల కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుంది.. బండి సంజయ్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
Kavitha | పార్లమెంట్ వేదికగా తెలంగాణపై విషం చిమ్మిన బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది.. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుందో లేదో అని ఆమె బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు.
Kavitha | హైదరాబాద్ : పార్లమెంట్ వేదికగా తెలంగాణపై విషం చిమ్మిన బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. కరెంట్ తీగలు పట్టుకుంటే తెలుస్తుంది.. తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుందో లేదో అని ఆమె బండి సంజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ఎల్పీలో కవిత మీడియాతో మాట్లాడారు.
ఇవాళ పార్లమెంట్లో బండి సంజయ్ విపరీతమైన అబద్ధాలు మాట్లాడారని కవిత తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జాతీయ హోదా ఇవ్వలేదు. మధ్యప్రదేశ్‌లో ఉన్న ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి రూ. 22 వేల కోట్లు ఇచ్చారు. కానీ తెలంగాణ కు ఇవ్వలేదు. నిన్న కేంద్ర మంత్రి నిషికాంత్ దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 86 వేల కోట్లు ఇచ్చామని అబద్ధాలు మాట్లాడారు. ఇవాళ కొనసాగింపుగా బండి సంజయ్ అదే మాట్లాడిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.
సంజయ్ విజ్ఞతకే వదిలేస్తున్నాను..
చాలా పర్సనల్‌గా మా నాయకుడిని తిట్టిండు.. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అని కవిత పేర్కొన్నారు. ఆయన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. 24 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందని సంజయ్ ప్రశ్నించారు. కరీంనగర్ బీజేపీ ఆఫీసుకు లేదా హైదరాబాద్ బీజేపీ ఆఫీసుకు రా. కరెంట్ తీగలు పట్టుకో. రోజులో ఎప్పుడైనా పట్టుకో.. కరెంట్ వస్తుందా లేదా తెలుస్తది. పార్లమెంట్లో నిలబడి అబద్దాలు మాట్లాడటం సరికాదు. అవకాశం వచ్చినప్పుడు ప్రజల కోసం మాట్లాడాలి. తెలంగాణ కోసం మాట్లాడాలి. ఒక మంచి మాట మాట్లాడు.. ఒక మంచి విషయం చెప్పు. మన హక్కుల కోసం ఒక్క బీజేపీ ఎంపీ కూడా పెదవి విప్పి పార్లమెంట్లో మాట్లాడలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వమంటే దాన్ని ఇవ్వరు అని కవిత కడిగిపారేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

