సెప్టెంబర్ 17 | తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేసిన ఎంపీ కేకే
ఎంపీ కేకే | సెప్టెంబర్ 17 సందర్భంగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు.

హైదరాబాద్: సెప్టెంబర్ 17 సందర్భంగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినమేనని, ఈ విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదని స్పష్టం చేశారు. 1947, ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం సిద్ధించలేదని, ఏడాది తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు. అందువల్ల ఇవాళ మన స్వాతంత్య్రం సంపూర్ణమయిందని చెప్పారు. సెప్టెంబర్ 17పై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
రాద్దాంతం ఎందుకు: బోడకుంటి
సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవంపై ప్రతిపక్షాలు రాద్దాంతం ఎందుకు మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన ఇప్పుడు యావత్ భారతదేశానికి రోల్ మోడల్‌గా మారిందన్నారు. గులాబీ జెండాయె ఇప్పుడు తెలంగాణకు శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

