కేసీఆర్ మరో అంబేద్కర్గా మిగిలిపోతారు : మోత్కుపల్లి
కేసీఆర్ మరో అంబేడ్కర్ | తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి రాజీనామా చేసిన సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దళితుల గుండెల్లో అంబేద్కర్ వారసుడిగా కేసీఆర్ మిగిలిపోతారు. దళిత బంధును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. దళితులందరూ సీఎం కేసీఆర్ అండగా నిలబడి హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ప్రతి ఊరు, ప్రతి వాడలో దళిత బంధు పథకంపై అవగాహన కల్పించేందుకు దండోరా వేయాలన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి దరువు వేశారు.
కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా
సీఎం కేసీఆర్‌పై విశ్వాసంతోనే బీజేపీకి రాజీనామా చేశాను అని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. ఈ దేశంలో దళితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. దళితులను గౌరవించాల్సిన అవసరం ఉంది. దళిత బంధు గురించి సీఎం కేసీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేసి చెప్పారు. దళిత బంధు కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టే ధైర్యం చేయలేదు. రైతుబంధు మాదిరిగా దళిత బంధును దళితుల ఖాతాల్లో వేస్తామని సీఎం కేసీఆర్ మాటిచ్చారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తున్న మొనగాడు కేసీఆర్ మాత్రమే అని నర్సింహులు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

