ఫార్మా ఎగుమతుల్లో రికార్డు

- ప్రపంచవ్యాప్తంగా నెగెటివ్‌లో ఫార్మా మార్కెట్
- 18 శాతం వృద్ధితో దూసుకుపోయిన భారత్
- వ్యాక్సిన్‌లో ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి
- ఫార్మాహబ్‌గా పేరొందిన హైదరాబాద్ నుంచే అధికం
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఫార్మా, వ్యాక్సిన్ ఎగుమతుల్లో భారత్ మరోసారి సత్తా చాటింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఫార్మా మార్కెట్ నెగిటివ్‌లో ఉండగా.. భారత్‌నుంచి ఫార్మా ఎగుమతులు మాత్రం 18 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం 24.44 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులు ఎగుమతులు జరిగాయి. ఇంత వృద్ధిని సాధించడం గత ఎనిమిదేండ్లలో ఇదే మొదటిసారి. వ్యాక్సిన్ ఎగుమతుల్లో 8 శాతం వృద్ధి నమోదు అయింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ నుంచి తయారవుతున్నవే కావడం విశేషం. దేశం నుంచి 2020-21ఆర్థిక సంవత్సరంలో 883 మిలియన్ డాలర్ల విలువైన వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో కరోనా వాక్సిన్ విలువ 143 మిలియన్ డాలర్లుగా తేల్చారు. వ్యాక్సిన్ తయారీకి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ నుంచే అత్యధికశాతం ఎగుమతి అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి ఎగుమతి అయ్యే వ్యాక్సిన్ల విలువ ఇంకా భారీమొత్తంలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 2019-20లో 20.58 బిలియన్ డాలర్లతో ఫార్మా ఎగుమతులు 7.57 శాతం వృద్ధిని సాధించాయి. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా మార్కెట్ రెండుశాతం వరకు నెగిటివ్‌లో ఉండగా.. భారత్ మాత్రం 18.07 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడం సాధారణ విషయం కాదని ఫార్మాసూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రవి ఉదయ్‌భాస్కర్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం అత్యధికంగా మార్చిలో రికార్డుస్థాయిలో 2.3 బిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తుల ఎగుమతి అయ్యాయి. గతేడాది మార్చితో పోల్చితే (1.54 బిలియన్ డాలర్లు) 48.5 శాతం వృద్ధి నమోదయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఇండియాలో తయారుచేసిన జనరిక్ మందులు, వాక్సిన్ల తయారీ మరింత పెరిగే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం ద్వారా దిగుమతులు తగ్గడమే కాకుండా కరోనా వ్యాక్సిన్లు అన్నీ భారత్‌లోనే తయారవుతుండటంతో ఎగుమతులు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రిడియెంట్స్ (ఏపీఐ)ల కోసం భారత్‌వైపు చూడనున్నారని అంచనా వేస్తున్నారు.
అత్యధికం నార్త్ అమెరికాకు..
భారత్ నుంచి అత్యధికంగా ఫార్మా, వ్యాక్సిన్లను నార్త్ అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మనదేశం నుంచి ఎగుమతయ్యేవాటిల్లో 34శాతం ఇక్కడికే వెళుతున్నాయి. యూఎస్ఏకు 12.6, కెనడాకు 30, మెక్సికో 21.4 శాతం అయ్యాయి. అఫ్రికాదేశాలకు ఎగుమతుల్లో గతేడాది గణనీయమైన వృద్ధి సాధించింది. 2019-20లో 2.24శాతం ఎగుమతులు ఉండగా 2020-21 లో ఏకంగా 13.40 శాతం ఉన్నాయి. అఫ్రికాలోనూ దక్షిణాఫ్రికాకు అత్యధికంగా ఎగుమతులయ్యాయి. ఇక్కడకి ఎగుమతుల్లో 28 శాతం వృద్ధి నమోదయింది. తర్వాత నైజీరియా, కెన్యా, టాంజానియా దేశాలకు ఎక్కువ శాతం జరిగాయి. యూరప్ దేశాలకు 11 శాతం ఎగుమతులు జరిగాయి. వీటితోపాటుగా ఆస్త్రేలియాకు 21 శాతం, యూఏపీకి 43 శాతం, ఉజ్బెకిస్థాన్‌కు 125 శాతం, ఉక్రెయిన్ ఎగుమతుల్లో 40.6 శాతం వృద్ధి నమోదయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

