Summer | ఎల్నినో ఎఫెక్ట్.. ఈ ఏడాది ఎండలు చెమటలు కక్కించుడు ఖాయమే!
Summer | హైదరాబాద్: ఈ ఏడాదిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Summer | హైదరాబాద్: ఈ ఏడాదిలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శుక్రవారం నాడు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పగటి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీసే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి-మే మధ్యకాలంలో దేశంలో అనేక చోట్ల సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు.
ఉత్తర, మధ్య భారత్లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని అన్నారు. ప్రస్తుత ఎల్నినో ప్రభావం వేసవి వరకూ ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని అన్నారు. మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య ఉంచి ఏర్పడనున్నట్లు అంచనా. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

