మాడల్’ ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణ మాడల్ స్కూల్స్ ఎం ట్రెన్స్ టెస్ట్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్‌టికెట్లను www.tgms.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు మాడల్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచారి వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మాడల్ స్కూల్స్ ఎం ట్రెన్స్ టెస్ట్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్‌టికెట్లను www.tgms.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్టు మాడల్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసచారి వెల్లడించారు. ఈ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12వరకు 6వ తరగతి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు 7నుంచి10వ తరగతిలో ప్రవేశాలకు పరీక్షలు జరుగనున్నట్టు పేర్కొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
డీఈఈ సెట్‌కు 20 వేల దరఖాస్తులు
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): డీఈఈ సెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 15న ముగియనున్నది. శుక్రవారం నాటికి 20,705 మంది దరఖాస్తులు సమర్పించారు. తెలుగు మీడియంలో పరీక్ష రాసేందుకు 7,543, ఇంగ్లిష్ మీడియంలో 12,256, ఉర్దూలో 906 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో దరఖాస్తులను సవరించుకోవచ్చని సెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.
టీఎస్టీ, ఎంఎస్టీ ఫలితాలు విడుదల
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను శుక్రవారం తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. టీఎస్టీలో 84 పోస్టుల కోసం 9,377 (59.36 శాతం) మంది, ఎంఎస్‌టీలో 114 పోస్టుల కోసం 2,755 (57.19శాతం) మంది అర్హత సాధించినట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా అఫీషియల్ వెబ్సైట్ www.tgprb.inలో తమ ఓఎంఆర్ షీట్లు, ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. సందేహాలుంటే support@tslprb.inకు మెయిల్ చేయాలని, లేదంటే 9391005006 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సదరు పోస్టులకు 1:5 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలిచామని, ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

