MLC Kavitha | జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబురాలు.. పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవ త్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్న విషయం విధితమే.
హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవ త్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు నిర్వహిస్తున్నది.
ఈ నెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితోపాటు, ప్రవాసీ భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ..బతుకమ్మకు అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్నటువంటి భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందని తెలిపారు.
బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యూకే విభాగాన్ని కల్వకుంట్ల కవిత అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షుడు బల్మురి సుమన్, టీ ఎస్ ఫుడ్స్ చైర్మన్ అండ్ భారత్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సాగర, భారత్ జాగృతి జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mulugu | ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరెస్ట్!
Fake Police | పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలు.. రెండు సార్లు జైలుకు వెళ్లినా మారని తీరు
Rajeev Kanakala | భార్య సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న రాజీవ్ కనకాల.. వీడియో వైరల్
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

