హైదరాబాద్ : సచివాలయం ప్రాంగణం(Secretariat premises)లో రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha )అన్నారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరారు. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ, తెలంగాణ తల్లి(Telangana thalli) తెలంగాణకు అత్యంత ముఖ్యం. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.