MLC Kavitha | కరీంనగర్ : మానకొండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్( MLA Rasamai Balakishan )పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశంసలు కురిపించారు. కరీంనగర్( Karimnagar ) జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ రాంలీల మైదానంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుక( Womens Day )ల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రసంగించారు.
మానకొండూరు ఆడబిడ్డల ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో రసమయి బాలకిషన్ 60 వేల ఓట్ల మెజారిటీతో మరోసారి గెలుస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం తన పాటతో అలుపెరుగని పోరాటం చేసిన ఘనత రసమయిది అని ప్రశంసించారు. గాయకుడు పాలకుడైతే అభివృద్ధి ఎలా ఉంటుందో మానకొండూరు నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతుంది అని కవిత పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.