అరవింద్.. నువ్వు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తాం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.
హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ అరవింద్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిజామాబాద్‌కే అవమానకరంగా ఎంపీ ప్రవర్తన ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతుతో యాక్సిడెంటల్‌గా గెలిచారని అన్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు.
‘ఇవాళ నేను బాధతో మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రజలు క్షమించాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి, నిజాయితీ, ఒక పద్ధతి ఉంటుంది. సీఎం కేసీఆర్‌ని అనరాని మాటలు అంటున్నారు. నేను కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ చెబుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు. ఇంత వరకూ నేను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోను. నా పుట్టుక, నా భవిష్యత్తు తెలంగాణ, టీఆర్ఎస్. బిడ్డా చెప్తున్నా.. గుర్తుపెట్టుకో. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెయ్ వెంటపడి ఓడిస్తాం’ అని అన్నారు.
పార్లమెంట్లో ఎంపీ అరవింద్ పెర్ఫార్మెన్స్ జీరో అని కవిత అన్నారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏనాడు ప్రశ్నించలేదని చెప్పారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ ఫేక్ సర్టిఫికెట్లపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కాలనీలో గల అరవింద్ ఇంటిని జాగృతి, టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ కార్యకర్తలు ముట్టడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

