MLC Kavitha : తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను జగిత్యాల జిల్లాలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. గనవేని మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి 20 మంది పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కవిత అభిమానులు పోతారపు రమేష్, తుమ్మ గంగాధర్, గంగుల శ్రీనివాస్, నారపాక రవీందర్ భైరవేని మహేష్, చంద్ర మౌళి, ఆర్ రంజిత్, ఆర్ అంజి, రాంకీ, రాజేందర్, డి తిరుపతి, పవన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.