MLC Kavitha | బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్
ఆదివారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు. మంత్రి సత్యవతి రాథోడ్ (Sathyavathi Rathod) , మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు.
హైదరాబాద్: బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha), తల్లి శోభమ్మతో కలిసి బల్కంపేట ఆలయంలో పూజలు చేసి..బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బతుకమ్మ సంబరాలు (Bathukamma Celebrations)లకు హాజరయ్యారు.
ఇవాళ సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో మహిళా పాత్రికేయులు బతుకమ్మలను తీర్చిదిద్దారు. మంత్రి సత్యవతి రాథోడ్ (Sathyavathi Rathod), మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని.. మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు.
వేడుకలకు వన్నె తెచ్చిన కళాబృందాలు..
తెలంగాణ సాంస్కృతిక శాఖకు చెందిన కళా బృందాలు వేడుకలకు శోభ తెచ్చాయి. లయబద్దంగా నృత్యాలు చేస్తూ వేడుకకు వెలుగు తెచ్చాయి. ఈ సందర్భంగా వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాల లాంటి ప్రదర్శనలు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పాటు సెలవు దినంగా చేశారన్నారు.

పండుగతో గ్రామీణ పేద మహిళలూ కొత్త చీరలు ధరించి బతుకమ్మ ఆడేలా రూ.339 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. దీని ద్వారా నేతన్నలకూ ఉపాధిని కల్పించడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ సభ్యులు, వారి కుటుంబాల మహిళలు సిద్దం చేసిన బతుకమ్మల పోటీల్లో ఆకారపు రామాదేవి ఉత్తమ బహుమతికి ఎంపికయ్యారు. విజేతలకు ప్రెస్‌క్లబ్ కమిటీ బహుమతులు ప్రధానం చేసింది.

ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్.వేణుగోపాలనాయుడు, రవికాంత్రెడి, కమిటీ ఉపాధ్యక్షులు శ్రీకాంతరావు, వనజ, కోశాధికారి రాజేష్. సంయుక్త కార్యదర్శులు హరి, రమేష్ వైట్లతో పాటు నూతన కార్యవర్గం మొత్తం హాజరయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

