MLC Kavitha | తెలంగాణ పండగలను సగర్వంగా చాటిచెబుదాం… సంస్కృతిని కొనసాగిద్దాం : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుతుండాలని అన్నారు. వందల ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగతో సంస్కృతిని కాపాడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందని స్పష్టం చేశారు.
MLC Kavitha | జగిత్యాల: ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుతుండాలని అన్నారు. వందల ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగతో సంస్కృతిని కాపాడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందని స్పష్టం చేశారు.
వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండగను విడవకుండా మన సంస్కృతిని కాపాడుతున్న ఘనత ఆడబిడ్డలకు దక్కుతుందని స్పష్టం చేశారు. మరో వందేళ్లపాటు కూడా బతుకమ్మ పండుగకు డోఖా ఉండకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమ సమయంలో పాఠశాలలకు వెళ్లి చిన్న పిల్లలకు బతుకమ్మ ఆవశ్యకతను చెప్పేవాళ్లమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత ఉత్సాహంతో ఘనంగా బతుకమ్మను నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
మంగళవారం రోజున జగిత్యాల పట్టణంలో వైభవోపేతంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన సంస్కృతి కచ్చితంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. సంస్కృతి లేని సమాజం అంటే వేర్లు లేని చెట్టు వంటిదని స్పష్టం చేశారు. సంస్కృతిని మరిచిపోయే సమాజం బాగుండదు కాబట్టి పండగలను సగర్వంగా చాటి చెబుతూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
మొట్టమొదటిసారిగా తాను మైక్ ముందు బతుకమ్మ పాట పాడానని, యూట్యూబ్‌లో అందరూ ఆ పాట విని అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. రాబోయే తరాల్లో బతుకమ్మ పాట పదిలంగా ఉండేందుకు పిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెలన్నీ నీళ్లతో, చెరువులతో కళకళలాడుతున్నాయని తెలిపారు. అమ్మవారి దయతో తెలంగాణ ఇలానే సుభిక్షంగా ఉండాలని, మంచిగా పంటలు ఉండాలని ఆకాంక్షించారు. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భారత జాగృతి కార్యకర్తలను కవిత అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

