ఈడీ వాదనల్లో కేసీఆర్ పేరే రాలే
కవిత బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు ఖండించారు.
- రాఘవ తన వాంగ్మూలంలోనూ ప్రస్తావించలేదు
- శ్రీనివాసులురెడ్డి పేరును కేసీఆర్‌కు అన్వయించారు
- పనిగట్టుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు
- కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు స్పష్టీకరణ
- వార్తా సంస్థలు తప్పుడు ప్రచారం ఆపాలని సూచన
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కవిత బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు ఖండించారు. ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ నమోదుచేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది.
ఈ సందర్భంగా మాగుంట రాఘవరెడ్డి తన వాంగ్మూలంలో కేసీఆర్ పేరును ప్రస్తావించారని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారంటూ కొన్ని చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. దీనిపై కవిత న్యాయవాది మోహిత్‌రావు స్పందించారు. అసలు ఈడీ న్యాయవాదుల వాదనల్లో ఎక్కడా కేసీఆర్ పేరు రాలేదని, మాగుంట రాఘవ వాంగ్మూలంలో కూడా కేసీఆర్ పేరు ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఈడీ న్యాయవాదులు మాగుంట రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి గురించి మాత్రమే ప్రస్తావించారని తెలిపారు. సంబంధిత వాంగ్మూల పత్రాన్ని మోహిత్‌రావు విడుదల చేశారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా బురద చల్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే తాను ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేస్తున్నాని తెలిపారు.
శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్‌కు అన్వయించారు
ఈడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ నిరుడు జూలై 26, 27 తేదీల్లో మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్తావించారని మోహిత్‌రావు గుర్తుచేశారు. ఇందులో ‘ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి మధ్య జరిగిన ఒప్పందం మేరకు అభిషేక్ బోయినపల్లి, బుచ్చిబాబు అనే వ్యక్తులకు రూ.25 కోట్ల నగదు ఇచ్చినట్టు రాఘవ చెప్పారు. ఇందులో రూ.10 కోట్ల నగదును 2021 మార్చి 28న బుచ్చిబాబు ఇచ్చిన చెన్నైలోని ఓ అడ్రస్‌లో, మరో రూ.15 కోట్లను 2021 జూన్‌లో అభిషేక్ బోయినపల్లి ఇచ్చిన ఓ అడ్రస్‌లో రాఘవ ప్రతినిధి గోపీ కుమారన్ అందజేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం కూడా దీనితో సరిపోలింది. తర్వాత కవిత తన టీమ్ సభ్యులు బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్పిైళ్లెని ఆయన (మాగుంట రాఘవ) తండ్రి (మాగుంట శ్రీనివాసులురెడ్డి)కి పరిచయం చేశారని, వాళ్లు ఢిల్లీలోని తన తండ్రి ఇంటిలో కలుసుకున్నారని రాఘవ చెప్పారు.
తర్వాత సమీర్ మహేంద్రు అనే వ్యక్తిని బుచ్చిబాబు ఆయనకు, ఆయన తండ్రికి పరిచయం చేశారని, తాము రిటెయిల్ బిజినెస్‌లో పార్ట్‌నర్‌షిప్‌పై చర్చలు జరిపామని చెప్పారు’ అని మాత్రమే వాంగ్మూలంలో ఉన్నదని తెలిపారు. ఈ వాంగ్మూలంలో ఎక్కడా కూడా కేసీఆర్ పేరే లేదని.. ఎమ్మెల్సీ కవిత నిందితులందరినీ ‘ఆమె’ తండ్రికి పరిచయం చేశారని, ఢిల్లీలోని ‘ఆమె’ తండ్రి నివాసంలో కలుసుకున్నారని చెప్పలేదని మోహిత్‌రావు స్పష్టం చేశారు. ఈడీ తరఫు న్యాయవాదులు శ్రీనివాసులురెడ్డి గురించి ప్రస్తావిస్తే, దానిని ఉద్దేశపూర్వకంగా కేసీఆర్‌కు అన్వయించారని విమర్శించారు.
వెంటనే అసత్య ప్రసారాలు ఆపండి
ఈ కేసులో మీడియా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. వాస్తవాలను పరిశీలించకుండా, నిరాధార కథనాలు ప్రసారం చేయొద్దని, ప్రచురించవద్దని పేర్కొన్నారు. శ్రీనివాసులురెడ్డి ప్రస్తావనను కేసీఆర్‌కు అన్వయించిన ఆయా చానళ్లు వెంటనే ఆ కథనాలను నిలిపివేయాలని, నిరాధార, అసత్య కథనాలను ప్రచురిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కు తన క్లయిం ట్ కవితకు ఉన్నదని మోహిత్‌రావు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

