MLC Jeevan Reddy | బీజేపీలోకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..! జగిత్యాల జిల్లాలో జోరుగా చర్చ..!!
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ క్రమంలో తన అనుచరుల ఫోన్ ఎత్తకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
MLC Jeevan Reddy | జగిత్యాల : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ క్రమంలో తన అనుచరుల ఫోన్ ఎత్తకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే జీవన్ రెడ్డిని కరీంనగర్, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ఈటల రాజేందర్ కలుస్తారని వార్తలు షికారు చేస్తున్నాయి. జీవన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ వార్తలపై జీవన్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు.
సంజయ్ చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో సోమవారం ఉదయం నుంచే జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే ఈ విషయమై పార్టీ అధిష్ఠానం ఆయనతో మాట్లాడుతున్నట్లు సమాచారం.
పార్టీ ఫిరాయింపులపై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే తన నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నదని, ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించడం లేదని తెలిపారు. ఇలాంటి వాటిని తాను వ్యక్తిగతంగా ప్రోత్సహించనని స్పష్టంచేశారు. అయితే ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జగిత్యాల రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. 2014లో జీవన్‌రెడ్డి చేతిలో ఓడిపోయిన సంజయ్.. ఆ తర్వాత జరిగిన 2018, 2023 ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

