అదనపు కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్
రాజకీయాల్లో మూర్ఖపు ఆలోచనలకు, స్వార్థ నిర్ణయాలకు తావు లేదంటూ జగిత్యాల అదనపు కలెక్టర్ వ్యాఖ్యానిస్తే.. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతి సంగతి అందరికి తెలుస్తూనే ఉందంటూ జగిత్యాల ఎమ్మెల్యేసంజయ్కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
- జగిత్యాలలో ఇద్దరి సంవాదం
- రాజకీయాల్లో మూర్ఖపు ఆలోచనలు తగదన్న ఏసీ
- అధికారుల అవినీతి తెలిసిందే అని ఎమ్మెల్యే అసహనం
జగిత్యాల, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : రాజకీయాల్లో మూర్ఖపు ఆలోచనలకు, స్వార్థ నిర్ణయాలకు తావు లేదంటూ జగిత్యాల అదనపు కలెక్టర్ వ్యాఖ్యానిస్తే.. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవినీతి సంగతి అందరికి తెలుస్తూనే ఉందంటూ జగిత్యాల ఎమ్మెల్యేసంజయ్కుమార్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వామ్యంలో స్వార్థ రాజకీయాల గురించి అదనపు కలెక్టర్ స్పందించడం, అధికారుల అవినీతిపైన ఎమ్మెల్యే మాట్లాడటం పెద్ద చర్చకు దారితీసింది. జగిత్యాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం వికసిత్ భారత్ ఆధ్వర్యంలో ‘యంగ్ పార్లమెంట్’ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ బీఎస్ లత ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
అదనపు కలెక్టర్ లత విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయాలు స్వార్థపూరితంగా మారిపోయాయని, ప్రజాస్వామ్యం సరిగా అమలు కావడం లేదని అన్నారు. ఢిల్లీ లాంటి చోట్ల జరుగుతున్న రాజకీయాలు కలుషితమయ్యాయని, ఇలాంటి అంశాలు రాష్ట్రంలోనూ కనిపిస్తున్నాయని తెలిపారు. రాజకీయాల్లో మూర్ఖపు ఆలోచనలు, స్వార్థ నిర్ణయాలకు తావు లేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో వేదికపై ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అదనపు కలెక్టర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అక్కడే ఉన్న మీడియా మిత్రులు కవరేజ్‌ని నిలిపివేయాలని కోరారు. అదనపు కలెక్టర్ రాజకీయాల గురించి మాట్లాడటం సరికాదని అన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు అవినీతికి పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అధికారుల అవినీతిపై తాము సైతం మాట్లడవచ్చునంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో కంగుతిన్న అదనపు కలెక్టర్ లత.. తన మాటల ఉద్దేశం అదికాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తదుపరి ఆమె మాట్లాడుతూ, తన మాటల్లో తప్పులు ఉంటే వెనక్కి తీసుకుంటున్నాని చెప్పారు. వేదికపైనే నెలకొన్న సంవాదంతో విద్యార్థులు, ఉపన్యాసకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే తన ప్రసంగాన్ని ముగించిన అదనపు కలెక్టర్ సమావేశం ఉందంటూ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రసంగం కాకముందే వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

